హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారు: తులసిరెడ్డి

KDP: ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నింటినీ ఎప్పటికి పూర్తి చేస్తారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాలు,నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్ వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికారం కోసం చంద్రబాబు ఎప్పుడూ ప్రజలను మోసం చేస్తుంటారని విమర్శించారు.