హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెప్టెంబర్ 1 నుంచి పోలీస్ యాక్ట్: ఎస్పీ

SRD: జిల్లాలో సెప్టెంబర్ 1 నుంచి 30 తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30, 30(ఏ) అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. జిల్లాలో పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు. పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.