హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

SRD : జిన్నారం మున్సిపల్ కేంద్రంలో మాల సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో ఆదివారం విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణం, మౌలిక వసతుల కోసం తనవంతుగా రూ.12 లక్షల విరాళం అందించారు.