సత్యసాయి: రోళ్ల మండలం కొడాగార్లగుట్ట, హోట్టేబెట్ట గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు శ్రీరామప్ప, చిన్నరంగప్ప, వెంకటరమణ, శశికుమార్, లక్ష్మన్న, రోజమణి తదితరులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తిప్పేస్వామి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రోళ్ల మండలంలో టీడీపీలోకి చేరికలు


