హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు కంగ్టిలో ప్రజావాణి: ఎంపీడీవో

SRD: కంగ్టి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నుంచి ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఎంపీడీవో దయాకర్ రావు తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించుకోవాలని, సంబంధిత శాఖల అధికారులు హాజరు కావాలని సూచించారు.