హైదరాబాద్: 28°C
క్రీడలు

అలాంటి చెత్త నిర్ణయాలు వద్దు: గవాస్కర్ 

టెస్టు క్రికెట్‌లో ఫ్రీ హిట్ నిబంధనను తేవాలనే ప్రతిపాదనలను సునీల్ గవాస్కర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. సుదీర్ఘ ఫార్మాట్ పవిత్రతను దెబ్బతీసే ఇలాంటి మార్పులు చేయవద్దని ఆయన స్పష్టం చేశాడు. నో-బాల్‌కు అదనపు పరుగుతో పాటు ఎక్స్‌ట్రా బంతి వేయడమే బౌలర్‌కు తగిన శిక్ష అని చెప్పాడు. ప్రతిదానికీ ఫ్రీ హిట్లు ఇస్తే బ్యాటర్లు, బౌలర్ల మధ్య సమతుల్యత దెబ్బతింటుందన్నాడు.