హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జర్నలిస్టులకు రైల్వే పాసులు పునరుద్ధరించాలి'

MBNR: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ రైల్వే పాసులను పునరుద్ధరించాలని తెలంగాణ ఉద్యమకారుడు హనీఫ్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కరోనా సమయంలో జర్నలిస్టులకు రాయితీతో అందించే రైల్వే పాసులను కేంద్రం రద్దు చేసిందన్నారు. చాలీచాలని జీతాలతో జీవిస్తున్న జర్నలిస్టులకు ఇది తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు.