హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పోచమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనాలు

ములుగు జిల్లా కేంద్రంలో పోచమ్మ దేవాలయంలో బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. నెత్తిన బోనాలతో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతురాజుకు మొక్కి కోళ్లను బలిచ్చారు. భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మికశోభ సంతరించుకుంది.