హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబితం జలపాతానికి పర్యాటకుల తాకిడి

PDPL: పెద్దపల్లి (M) సబితం గ్రామంలోని జలపాతం వర్షాకాలంలో సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. దట్టమైన అటవీ ప్రాంతం, చుట్టూ కొండల నడుమ ఉన్న ఈ జలపాతాన్ని చూసేందుకు ప్రతిరోజూ వందలాది మంది తరలివస్తుంటారు. అయితే పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ జిల్లా అధికారుల నుంచి తగినంత శ్రద్ధ లేకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.