హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రవీణ్ అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ

JN: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన గానుగుపహాడ్‌కు చెందిన ప్రవీణ్ (24) మృతి చెందాడు. విషాద సమయంలోనూ కుటుంబ సభ్యులు అతని అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. తండ్రి అంజయ్య, భార్య శ్రావణి తీసుకున్న నిర్ణయంతో ప్రవీణ్ అవయవదానం ద్వారా ఐదుగురికి పునర్జన్మ లభించింది. కుటుంబ సభ్యుల మానవతా నిర్ణయాన్ని పలువురు అభినందించారు.