BDK: పాల్వంచ ఇందిరా కాలనీ సాయిబాబా గుడి సమీపంలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టుకోవడంతో ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. స్పందించిన స్థానికులు 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ఒకరికి గాయాలు


