హైదరాబాద్: 28°C
క్రీడలు

మళ్లీ ఐపీఎల్ చైర్మన్‌గా అరుణ్ ధుమాల్!

ఐపీఎల్ పాలక మండలి(GC)లోని రెండు సభ్య పదవుల ఎన్నికకు BCCI నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 18న జరిగే BCCI వార్షిక సర్వసభ్య సమావేశంలో(AGM) ఈ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న అరుణ్ ధుమాల్, సభ్యుడు మజుందార్‌ ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం వీరి పదవీకాలం ఏడాది మాత్రమే కావడంతో మళ్లీ ఎన్నిక అనివార్యమైంది.