హన్మకొండ నగరంలోని కనకదుర్గ కాలనీ జీడబ్ల్యూఎంసీ పార్కును ఆధునిక సౌకర్యాలతో మోడల్ పార్కుగా అభివృద్ధి చేస్తామని ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఆదివారం పార్కును పరిశీలించి వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, లైటింగ్ తదితరాలను పరిశీలించారు. చిన్నారులకు ఆటస్థలం, మెరుగైన లైటింగ్, మెడిటేషన్ హాల్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
'కనకదుర్గ కాలనీ పార్కును మోడల్ పార్కుగా అభివృద్ధి చేస్తాం'


