హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరాలి: కలెక్టర్

ADB: జిల్లాలోని అర్హులందరికీ సంక్షేమ అభివృద్ధి పథకాలు చేరాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఆదివారం తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లతో సొంతింటికల నెరవేరిందని అన్నారు.