హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఢిల్లీ తరలివెళ్లిన సీపీఐ నేతలు

HNK: ఢిల్లీలోని రాంలీలా మైదాన్ లో జరిగే 'బడ్లావ్ జరూరీ హై' మహాసభలో పాల్గొనేందుకు సీపీఐ నేతలు ఆదివారం తరలివెళ్లారు. కాజీపేట నుంచి రైలులో వారు భారీ సంఖ్యలో ఢిల్లీ బయలుదేరారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, విపరీతమైన ధరల పెరుగుదల, ప్రజాస్వామ్య హక్కుల హననం, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు.