హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలకుర్తిలో ఘనంగా గర్భగుడి సింహా ద్వారా ప్రతిష్ఠాపన

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణ పనులలో ఈరోజు గర్భగుడి సింహా ద్వారా ప్రతిష్ఠాపన (దర్వాజా ఎత్తే కార్యక్రమం) ఘనంగా జరిగింది. ఆలయ పూజారి గంగు నవీన్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, సింధూర లేపనం చేసి, తెల్లజిల్లేడు పూలు, పూలమాలలతో అలంకరించి, నైవేద్యం అనంతరం హరతి ఇచ్చారు.