హైదరాబాద్: 28°C
తెలంగాణ

అథ్లెటిక్స్ పతక విజేతలను సన్మానించిన ఎమ్మెల్యే

GDWL: హన్మకొండలో జరిగిన సౌత్ జోన్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన గద్వాల జిల్లా క్రీడాకారులను ఆదివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారులు గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధించి జిల్లా కీర్తిని చాటారని ప్రశంసించారు. అథ్లెటిక్స్ రంగంలో యువత మరింత రాణించాలని ఆయన ఆకాంక్షించారు.