ఖమ్మం జిల్లా తాగునీటి అవసరాలు, మిషన్ భగీరథ కోసం నాగార్జునసాగర్ నుంచి పాలేరు జలాశయానికి నీటిని విడుదల చేసినట్లు ఇరిగేషన్ ఎస్‌ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 15.90 అడుగుల నీరు ఉండగా, దీనిని పూర్తిస్థాయి మట్టమైన 23 అడుగులకు నింపేందుకు సాగర్ నుంచి 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
పాలేరుకు సాగర్ నీరు విడుదల..!


