హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య శిబిరం

BDK: బండారు చందర్రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రాచలంలో ఇవాళ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ముఖ్యంగా షుగర్, బీపీ సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొని మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.