హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యాటక రంగాలను మరింత అభివృద్ధి చేస్తాం: మంత్రి

KMM: రఘునాథపాలెంలో రూ.92.76 కోట్లతో స్టేడియం నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో క్రీడా, పర్యాటక రంగాలను మరింత అభివృద్ధి చేసి, వసతులు కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఖమ్మంలో పూర్తయిన సింథటిక్ ట్రాక్ను వినియోగంలోకి తీసుకురావడం హర్షనీయం అన్నారు.