హైదరాబాద్: 28°C
తెలంగాణ

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

RR: ఫరూక్‌నగర్ మండలం అయ్యవారిపల్లిలో రూ. 10 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యమన్నారు. వీధిలైట్లు, సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వార్డు సభ్యురాలు మంజుల కోరగా, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.