NRML: నిర్మల్ జిల్లాలో ఈ ఏడాది జూన్ 1 నుంచి ఆగస్టు 30 వరకు 642.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 720.7 మి.మీ. కాగా, 10.8 శాతం లోటు నమోదైనప్పటికీ జిల్లా స్థాయిలో వర్షపాతం సాధారణంగానే ఉంది. కుబీర్‌లో అత్యధికంగా 36 శాతం, తానూర్‌లో 36 శాతం లోటు నమోదైంది. మరోవైపు పెంబిలో 20 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
నిర్మల్ జిల్లాలో లోటు వర్షపాతం నమోదు


