హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీట్‌ పీజీ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

WGL: నర్సంపేట పట్టణంలోని బిట్స్‌ కాలేజీలో ఆదివారం నిర్వహించిన నీట్‌ పీజీ–2026 పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద పరిశీలించారు. పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించి, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టిన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంతంగా, నిబంధనల ప్రకారం జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.