KMR: నస్రులాబాద్ (M) బస్వాయిపల్లికి చెందిన విఠల్(28) అప్పుల భారంతో మనస్తాపానికి గురై ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇంటి నిర్మాణం కోసం రెండు ఫైనాన్స్ కంపెనీల్లో రుణం తీసుకున్నామని, EMIలు చెల్లించకపోవడంతో ఆగస్టు 22న ఓ ఫైనాన్స్ వారు ఇంటిని సీజ్ చేశారని మృతుని భార్య పోలీసు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
అప్పుల భారంతో వ్యక్తి ఆత్మహత్య!


