హైదరాబాద్: 28°C
తెలంగాణ

​జూబ్లీహిల్స్ క్లబ్‌లో వివాదం

HYD: జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ క్లబ్‌లోకి దౌర్జన్యంగా ప్రవేశించి సస్పెండ్ అయిన మాజీ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ వసంత్ కుమార్ హెచ్చరించారు. గతంలో అవినీతి ఆరోపణలతో సస్పెండైన వీరు, సిబ్బందిని ఇబ్బంది పెడుతూ క్లబ్ ప్రతిష్టను దిగజార్చుతున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై పోలీసులకు, కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు.