హైదరాబాద్: 28°C
వ్యాపారం

దేశీయంగా లలితా జువెలరీ భారీ విస్తరణ

IPO పూర్తి చేసుకున్న 'లలితా జువెలరీ' భారీ విస్తరణకు సిద్ధమైంది. ప్రస్తుతం TG, AP సహా దక్షిణాదిలో 64 షోరూమ్‌లు ఉండగా.. కొత్తగా 110 స్టోర్లను ప్రారంభించనున్నట్లు సంస్థ సీఎండీ ఎం.కిరణ్‌ తెలిపారు. 2027 మార్చి నాటికి కనీసం 10 స్టోర్లు ఏర్పాటు చేస్తామన్నారు. దక్షిణాదిలో 175 షోరూమ్‌ల లక్ష్యం చేరగానే మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ మార్కెట్లలోకి అడుగుపెడతామని వెల్లడించారు.