హైదరాబాద్: 28°C
వ్యాపారం

HDFC ఎండీ కీలక నిర్ణయం

HDFC బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీషన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవీకాలం ముగిసిన తర్వాత తిరిగి బ్యాంకు బాధ్యతలను కొనసాగించే ఆలోచన తనకు లేదని వెల్లడించారు. ప్రస్తుత తన పదవీకాలం అక్టోబర్ 26తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీఈఓ ఎంపికను HDFC బోర్డు వేగవంతం చేసింది. అయితే శశిధర్ ప్రకటన బ్యాంకింగ్ రంగంలో చర్చనీయాంశమైంది.