హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడవి పందిని ఢీకొని యువకుడి మృతి

JN: రోడ్డు ప్రమాదంలో గానుగుపహాడ్‌కు చెందిన కన్నెబోయిన ప్రవీణ్‌ మృతి చెందాడు. ఈ నెల 27న ద్విచక్రవాహనంపై వెల్దండకు వెళ్లి తిరిగి వస్తుండగా వెంకిర్యాల శివారులో అకస్మాత్తుగా అడవి పంది రోడ్డుకు అడ్డంగా వచ్చింది. దానిని ఢీకొని అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. HYF లోనిఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రవీణ్‌‌కు 2 నెలల క్రితమే వివాహం జరిగింది.