హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నీటి సమస్య.. ఇబ్బందుల్లో ప్రజలు

NRPT: దామరగిద్ద మండలం ఉడ్మల్‌గిద్ద వద్ద మిషన్ భగీరథ పంప్‌హౌస్‌లో 300 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో వారం రోజులుగా 14 గ్రామాలకు నీటిసరఫరా నిలిచిపోయింది. కానుకుర్తి, మునకన్నల్లి, మడేపల్లి, ఇట్లాపూర్, ఉల్లిగుండం, అన్నాసాగర్ తదితర గ్రామాల ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించి నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు.