హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూసాపేట్ బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

MDCL: మూసాపేట్ డివిజన్‌కు చెందిన సైలాడ రఘు (తండ్రి: భానుమూర్తి)కి మంజూరైన రూ. 2 లక్షల సీఎంఆర్‌ఎఫ్ ఎల్‌వోసీ చెక్కును ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. చెక్కు అందుకున్న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.