హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి రద్దు: కలెక్టర్

GDWL: జిల్లా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి జిల్లా పర్యటన ఏర్పాట్లు, ఓటర్ల జాబితా సవరణ విధుల్లో అధికారులు నిమగ్నమైనందున సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణిని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని, అసౌకర్యాన్ని నివారించేందుకే ముందస్తు సమాచారం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.