BHNG: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని ఆదివారం ఉదయం బీఎస్ఎన్ఎల్ టవర్ సమీపంలో మినీ వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. భువనగిరి వైపు నుంచి వడ్ల లోడ్‌తో వస్తున్న వ్యాన్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డ్రైవర్ కుర్మిల్ల నరేష్‌కు గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న మినీ వ్యాన్!


