హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉల్లి రైతులకు ప్రోత్సాహం.. భారీ సంఖ్యలో దరఖాస్తులు

VKB: ఉల్లి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ సొమ్ము పొందేందుకు దరఖాస్తులు భారీ సంఖ్యలో వచ్చాయి. తాండూరు మండలంలోని పలు గ్రామాల రైతులు ఉద్యానశాఖ అధికారి సురేందర్‌కు అర్జీలు సమర్పించారు. శనివారం ఒక్కరోజే గడువు ఉండడంతో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  290 మంది రైతులు రాయితీకి, 27 మంది రూ. లక్ష రాయితీతో షెడ్డు మంజూరుకు దరఖాస్తులు అందించారు.