హైదరాబాద్: 28°C
క్రీడలు

ఉమెన్ హాకీ వరల్డ్ కప్ విజేత అర్జెంటీనా

ఉమెన్ హాకీ వరల్డ్ కప్ విజేతగా అర్జెంటీనా నిలిచింది. నెదర్లాండ్స్‌తో జరిగిన ఫైనల్లో ఇరు జట్లు నిర్ణీత సమయంలో 1-1 గోల్స్ కొట్టి సమంగా నిలిచాయి. దీంతో షూటౌట్ నిర్వహించగా 3-1తో నెదర్లాండ్స్‌ను ఓడించి అర్జెంటీనా టైటిల్ సొంతం చేసుకుంది. అర్జెంటీనా మహిళల జట్టుకు ఇది 3వ వరల్డ్ కప్. గతంలోనూ నెదర్లాండ్స్‌పైనే (2002, 2010) అర్జెంటీనా నెగ్గి ట్రోఫీని కైవసం చేసుకోవడం విశేషం.