హైదరాబాద్: 28°C
క్రీడలు

నేటి నుంచి దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్స్

బెంగళూరు వేదికగా ఇవాళ్టి నుంచి ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. తొలి సెమీస్‌లో సౌత్ జోన్ జట్టుతో నార్త్ జోన్ తలపడనుంది. అలాగే మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫైనల్ చేరేందుకు జట్లన్నీ తీవ్రంగా శ్రమిస్తుండటంతో ఈ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.