హైదరాబాద్: 28°C
క్రీడలు

WT20 AC: భారత్‌, థాయ్‌లాండ్ మధ్య పోరు

మహిళల టీ20 ఆసియాకప్ టోర్నీలో భాగంగా ఈరోజు భారత జట్టు థాయ్‌లాండ్‌తో తలపడనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించి టోర్నీలో తమ ఆధిపత్యాన్ని మరింతగా కొనసాగించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. కాగా, ఈ ఆసక్తికర పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.