హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలేరు జలాశయానికి సాగర్‌ నుంచి నీటి విడుదల

KMM: నాగార్జునసాగర్‌ నుంచి పాలేరు జలాశయానికి నీటిని విడుదల చేసినట్లు ఇరిగేషన్‌ ఎస్సీ మంగళపూడి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ప్రస్తుతం పాలేరు జలాశయంలో 15.90 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. జిల్లా తాగునీటి అవసరాలు, మిషన్‌ భగీరథ కోసం జలాశయాన్ని పూర్తిస్థాయి 23 అడుగుల నీటిమట్టానికి నింపేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.