ASF: అప్పపెల్లి పంచాయతీ కేంద్రంలో 11 కేవీ విద్యుత్ తీగలను కర్రతో ఇలా పైకి ఎత్తి ఉంచారు. జనావాసాల మధ్య ఉండటం, గాలులు వీస్తే ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వేలాడుతున్న తీగలను సవరించాలని సంబంధిత అధికారుల దృష్టికి తీసికెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తీగలను సవరించాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
కర్ర జారితే.. ప్రాణాలకే ముప్పు


