హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆధార్ కేంద్రాలు పెంచాలని డిమాండ్

ADB: ఇచ్చోడ మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉన్న ఆధార్ సేవలు పొందేందుకు ప్రజలు ప్రతిరోజూ భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రోజుకు 25 మందికి మాత్రమే ఆధార్ సేవలు అందుతున్నాయి. పరిమిత సంఖ్యలోనే టోకెన్లు ఇవ్వడంతో రోజు పలువురు నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.