హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పిచ్చికుక్కల దాడులు.. 9 మందికి గాయాలు

ASF: బెజ్జూర్ మండల కేంద్రంలో పిచ్చికుక్కల దాడిలో 9 మంది గాయపడి CHCలో చికిత్స పొందుతున్నట్లు వైద్యుడు డాక్టర్ శ్రావణ్ తెలిపారు. గత 3 రోజులుగా కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారు. సర్పంచ్ దుర్గం సరోజ ఆదేశాలతో కార్యదర్శి వైకుంఠం సిబ్బందితో కలిసి కుక్కలను ఊరు దాటించారు.