హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు ప్రోత్సాహంగా సౌండ్‌ సిస్టం బహూకరణ

MLG: మంగపేట మండలంలోని ముల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు గ్రామానికి చెందిన ఏడునూతుల వసంతకుమారి సౌండ్‌ సిస్టంను బహూకరించారు. శ్రీలక్ష్మీనరసింహ దత్త సేవా ట్రస్ట్ సభ్యులు శనివారం దానిని పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా పదో తరగతిలో పాఠశాల టాపర్‌గా నిలిచిన గనోజ్జు శరణ్యను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఛైర్మన్ ఈశ్వర్‌చంద్ శర్మ, సభ్యులు పాల్గొన్నారు.