హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడి కేంద్రాలకు ఉచిత విద్యుత్

పెద్దపల్లి జిల్లాలోని అంగన్వాడి కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఎన్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు చేపట్టిందని పెద్దపల్లి సర్కిల్ ఎస్ఈ వి.గంగాధర్ తెలిపారు. సర్కిల్ పరిధిలోని 128 అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందించినట్లు పేర్కొన్నారు. లైట్లు, ఫ్యాన్లు, తాగునీటి మోటార్లు వినియోగంతో చిన్నారులకు మెరుగైన వాతావరణం ఏర్పడుతుందన్నారు.