హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆదివాసీ మార్చ్‌ను విజయవంతం చేయాలి'

MLG: కన్నాయిగూడెం మండల కేంద్రంలోని కొమురం భీం విగ్రహం వద్ద శనివారం చలో ఐటీడీఏ ఆదివాసీ మార్చ్‌ గోడపత్రికను ఆవిష్కరించారు. సెప్టెంబర్‌ 7న నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తుడుం దెబ్బ జాతీయ నాయకుడు పొడెం బాబు, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి పిలుపునిచ్చారు. జనరల్‌ నోటిఫికేషన్లతో గిరిజన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు.