హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా కృష్ణాష్టమికి ఏర్పాట్లు

NLG: నార్కట్‌పల్లి మండలం శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 4న శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయని దేవస్థాన వ్యవస్థాపక ఛైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి తెలిపారు. వేడుకల్లో భాగంగా ఉ. 6గం.కు స్వామివారి అభిషేకం, ఉ.9:30 గం.కు అమ్మవారికి కుంకుమార్చనలు, ఉ.11గం.కు సుదర్శన హోమం, సా.4:30గం.కు ఉట్టి కొట్టు కార్యక్రమం ఉంటాయన్నారు.