హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆంజనేయ స్వామిని దర్శించుకున్న కమిషనర్

JGL: కొండగట్టు పుణ్యక్షేత్రంలోని శ్రీ ఆంజనేయ స్వామిని ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయనకు ఆలయ సంప్రదాయ ప్రకారం అధికారులు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు అధికారులు శేష వస్త్రంతో సత్కరించి, అర్చకులు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.