హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్షలు ఖర్చు.. మూతపడ్డ పబ్లిక్ టాయిలెట్లు

SRCL: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయం పక్కన ఉన్న మున్సిపల్ పబ్లిక్ మరుగుదొడ్లు చాలా రోజులుగా మూతపడి నిరుపయోగంగా మారాయి. పరిసరాల్లో పిచ్చిమొక్కలు పెరిగి దుర్వాసన వెదజల్లుతోంది. సమీపంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో మహిళలు, దూర ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే శుభ్రపరచి వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.