హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ పట్టణంలో వీధి కుక్కల బెడద

KNR: కరీంనగర్ పట్టణంలోని పలు కాలనీల్లో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. ఏ గల్లీలో చూసినా గుంపులుగా సంచరిస్తుండటంతో వాహనదారులు, పాఠశాల విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. వాహనాల వెంట పరుగెత్తుతూ కాటు వేసేందుకు ప్రయత్నిస్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.