మహబూబాబాద్ హస్తినాపురం కాలనీలో బ్యాంకు ఉద్యోగి అజ్మీర హిమసాగర్ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బీరువాలోని 37 గ్రాముల బంగారం, 14 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.3 వేల నగదు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించి శనివారం కేసు నమోదు చేశారు. దొంగల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
తెలంగాణ
హస్తినాపురం కాలనీలో చోరీ.. 37 గ్రాముల బంగారం అపహరణ


