MHBD: మరిపెడ పట్టణం కేంద్రంలోని భవిత కేంద్రంలోకి శనివారం విషసర్పం రావడంతో చిన్నారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పామును గమనించిన ఉపాధ్యాయురాలు వెంటనే బయటకు వచ్చి స్థానికులకు సమాచారం అందించారు. దీంతో మాజీ సర్పంచ్ జనార్దన్ స్పందించి పామును చాకచక్యంగా పట్టుకున్నారు. నెల రోజుల్లోనే రెండోసారి పాము రావడంతో కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
తెలంగాణ
భవిత కేంద్రంలో విషసర్పం.. భయాందోళన


