హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై దాడి 9 మంది అరెస్ట్!

BDK: అశ్వారావుపేట మండలం వేదాంతపురం అటవీ ప్రాంతంలో శనివారం పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్, అశ్వారావుపేట పోలీసులు ఒక్కసారిగా దాడి చేశారు. పేకాట ఆడుతున్న 9 మందిని పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.1,22,310 నగదు, 2 కార్లు,16 మోటార్ సైకిళ్లు,16 ఫోన్లు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మాయాతి రాజు తెలిపారు.